అరటి పండ్లు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో ఉంచితే.. ఏమవుతుంది.?
09 September 2025
Prudvi Battula
చాలామంది అరటి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువగా తెచ్చుకొని చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో దాచుకొని తింటూ ఉంటారు.
అరటిపండ్లను బయట వదిలేస్తే ఈగలను ఆకర్షిస్తాయి. అలాగే త్వరగా గోధుమ రంగులోకి మారుతాయి. వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ఈ సమస్యకు పరిష్కారమా? అనే దానిపై అధ్యయనం జరిగింది.
జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం అరటిపండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టలను పరిశీలించింది.
అరటిపండ్లు ఉష్ణమండల పండ్లు. కాబట్టి వాళూ రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం మంచి ఆలోచన కాదు. గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలని ఈ అధ్యయనం వెల్లడించింది.
అరటిపండ్లు చల్లని వాతావరణంలో త్వరగా పండుతున్నాయని. వాటి తొక్కను దెబ్బతింటుందని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇప్పటికే పండిన అరటిపండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం మంచిది కాదు. కాదని ఉంచితే మాత్రం మిగిలిన ఆహార పదార్థాలు కూడా పాడవుతాయి.
అయితే పచ్చి అరటి రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. అవి పండే ప్రక్రియ నెమ్మదిస్తుందని, అలాగే తాజాగా కూడా ఉంటాయని ఈ పరిశోధన వెల్లడైంది.
దీని బట్టి పండిన అరటి పండ్లు కంటే.. పచ్చి అరటిని మాత్రమీ ఫ్రిడ్జ్‌లో ఉంచడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.