కుల గణన వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
03 May 2025
Prudvi Battula
జనాభా లెక్కలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కుల గణన కూడా జరుగుతుంది.
భరతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. చివరిగా కులగణన 1931లో బ్రిటిష్ పాలకులు నిర్వహించడం జరిగింది.
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత, 1951 సంవత్సరం నుంచి అప్పటి ప్రభుత్వ అధికారులు కుల గణన నిషేధించారు.
భారతదేశంలో కుల ఆధారిత వివక్షను నివారించడంలో.. వెనుకబడిన సమూహాలను గుర్తించడంలో.. వారి కోసం విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది.
కుల గణన నుండి వెలువడే డేటా అణగారిన వర్గాల పురోగతికి సహాయపడుతుంది. దీని నుండి ప్రత్యక్ష ప్రయోజనం పొందవచ్చు.
OBCలు, ఇతర వెనుకబడిన వర్గాల ఖచ్చితమైన జనాభా డేటా లేకుండా, ప్రభుత్వ వనరుల సమాన పంపిణీని నిర్ధారించడం కష్టం.
వివిధ కుల సమూహాల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, వారి అవసరాల గురించి సమాచారాన్ని అందించడానికి కుల గణన ఉపయోగపడుతుంది.
కుల గణన సమాజ సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. ప్రభుత్వం తన విధానంలో ఎంత మార్పు తీసుకురావాలో ఇది చెబుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు?
ఇలాగైతే మీ వాట్సాప్ కట్..!
గూగుల్ హిస్టరీని సింపుల్గా డిలిట్ చేయవచ్చు!