మీ గూగుల్ హిస్టరీని ఎవరైనా చూడగలరు. దీన్ని నివారించడానికి, మీరు గూగుల్ హిస్టరీని ఎలా తొలగించాలో తెలుసుకోవాలి.
మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి గూగుల్ చరిత్రను తొలగించడానికి ఈ దశలను అనుసరించండి.
ముందుగా మీరు మీ కంప్యూటర్‌లో గూగుల్‌ని తెరవాలి. దీని తర్వాత అప్షన్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత, హిస్టరీ ఎంపికకు వెళ్లండి.
మీరు తీసివేయాలనుకుంటున్న అంశం పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి. ఇప్పుడు, మీరు కుడి వైపున చూపించే డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీరు మీ Android స్మార్ట్‌ఫోన్ నుంచి గూగుల్ హిస్టరీని తొలగించవచ్చు. ముందుగా మీ గూగుల్ అప్లికేషన్‌ను తెరవండి. దీని తరువాత, సెర్చ్ హిస్టరీపై క్లిక్ చేయండి.
అక్టివిటిస్ తొలగించు క్లిక్ చేయండి. తేదీ పరిధిని ఎంచుకుని, ఆ వ్యవధిలో కార్యకలాపాన్ని తొలగించు క్లిక్ చేయండి.
గూగుల్ యాప్‌లో, ఎగువ కుడి మూలలో ఉన్న ప్రొఫైల్‌ను క్లిక్ చేయండి. సెర్చ్ హిస్టరీ మెనుని ఎంచుకోండి. ఇక్కడ, అన్నీ తొలగించు ఎంపికను ఎంచుకోండి.
దీని తరువాత అన్ని సెర్చ్‌లను ఒకే క్లిక్‌తో తొలగించవచ్చు. మీరు ఏదైనా ఒక రోజు సెర్చ్ హిస్టరీని తొలగించాలనుకుంటే, తేదీ నుండి అన్ని కార్యకలాపాలపై క్లిక్ చేయాలి.
మీరు ప్రతిదీ తొలగించే ఎంపికను పొందుతారు. దీని తర్వాత మీరు ఎంచుకున్న రోజు హిస్టరీ మొత్తాన్ని తొలగించవచ్చు.