సండే కొత్త రెసిపీ తినాలని ఉందా.? మనపట్టి చికెన్ సుక్కా ట్రై చెయ్యండి..
18 October 2025
Prudvi Battula
Images: Pinterest
ప్రోటీన్‌తో సహా వివిధ పోషకాలు సమృద్ధిగా ఉన్న చికెన్‌ను మితంగా తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చికెన్
చికెన్ ఉపయోగించి వివిధ వంటకాలు చెయ్యవచ్చు. ఈరోజు సాంప్రదాయ రుచిగల మనపట్టి చికెన్ సుక్కాను ఎలా తయారు చేయాలో చూద్దాం..
చికెన్ వంటకాలు
150 మి.లీ. నెయ్యి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 1 కిలో మాంసం, 1/2 టీస్పూన్ పసుపు, జీలకర్ర పొడి, 50 గ్రాముల కారం, ఎర్ర మిరపకాయ, జీడిపప్పు.
కావాల్సిన పదార్దాలు
ముందుగా, మనపట్టి చికెన్ సుక్కా రెసిపీ చేయడానికి మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన చికెన్‌ను నీటితో బాగా శుభ్రం చేసుకోండి.
రెసిపీ
శుభ్రం చేసిన చికెన్‌ను ఒక పాత్రలో వేసి స్టవ్ మీద మీడియం మంటపై ఉంచండి. నీళ్లు ఇంకిపోవడం ప్రారంభించినప్పుడు, మాంసాన్ని తీసి పక్కన పెట్టుకోండి.
మీడియం మంట
తరువాత ఓ పాన్‌లో నూనె పోసి, అది వేడెక్కిన తర్వాత పక్కన పెట్టిన చికెన్ వేసుకొని ఎర్ర కారం, పసుపు, కారం పొడి వేసి బాగా కలపండి.
బాగా కలపాలి
తర్వాత అందులో కరివేపాకు, అవసరమైనంత ఉప్పు, అల్లం వేసి బాగా కలిపి నీరు పోసి, మరిగించి బాగా ఉడికించాలి.
బాగా ఉడికించాలి
తరువాత స్టవ్ మీద పాత్రలో చికెన్ రంగు మారి ఉడికిన తర్వాత, కరివేపాకు, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి.
కరివేపాకు
స్టవ్ ఆఫ్ చేసి, జీడిపప్పు చల్లి చల్లారనివ్వండి. అంతే రుచికరమైన రుచికరమైన మనపట్టి చికెన్ సుక్కా సిద్ధం అయిపోయినట్టే.
రెసిపీ సిద్ధం
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..