ఫేక్ న్యూస్ కాదు..ఇక ఆ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవు..!

06 September 2025

Prudvi Battula 

ట్రాఫిక్ లైట్ అనేది కూడళ్లు, క్రాసింగ్‌ల వద్ద సిగ్నలింగ్ పరికరం. ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన లైట్లు.

ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లైట్లను ఉపయోగించి ట్రాఫిక్ ప్రవాహాన్ని నియంత్రిస్తూ ఉంటారు ట్రాఫిక్ అధికారులు.

ఈ సిగ్నల్ లైట్స్ వాహనదారులు, పాదచారులకు ఎప్పుడు ఆగాలో, జాగ్రత్తగా ఉండాలో లేదా ముందుకు సాగాలో చెబుతాయి.

ఈ సిగ్నల్స్ అధిక జనాభా కలిగిన, అభివృద్ధి చెందిన నగరాల్లో వాహనాల ట్రాఫిక్ నియంత్రణ ఎక్కువగా ఏర్పాటు చేస్తారు.

కానీ భారతదేశంలో పూర్తిగా ట్రాఫిక్ లైట్స్ లేని మొట్టమొదటి నగరంగా రాజస్థాన్ రాష్ట్రంలో కోటా నిలిచింది.

కోటా నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చడం జరిగింది.

ఈ నగరంలో ట్రాఫిక్ సిగల్ లైట్స్ స్థానంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, పెద్ద రౌండ్అబౌట్‌లు నిర్మించడం జరిగింది.

వీటివల్ల సిగ్నల్ లైట్స్ పని లేకుండా పోయింది. భారతదేశంలో ట్రాఫిక్ లైట్ లేని మొదటి నగరం, ప్రపంచంలో రెండవది కోటా నగరం.