ముఖం కాంతివంతంగా, చర్మం అందంగా మెరవాలంటే..

Jyothi Gadda

11 March 2025

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఈ బిజీ లైఫ్ లో కొంచెం టైం సెట్ చేసుకొని ఈ టిప్స్ పాటిస్తే అందమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. వృద్ధాప్యం దరి చేరదు. 

ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాసు వాటర్ లేదా ఒక గ్లాసు నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని తాగటం వల్ల శరీరంలో చక్కని డిటాక్సిఫికేషన్‌ జరుగుతుంది.

రోజు గంటల తరబడి కూర్చొని ఉండేవారు క్రమం తప్పకుండా రోజూ అరగంట పాటు యోగా, వ్యాయామం చేయటం వల్ల అందంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు కొబ్బరి పాలు కలుపుకొని స్నానం చేయడం వలన చర్మం పొడిబారదు, వృద్దప్య లక్షణాలు త్వరగా రావు అలాగే అందంగా కూడా తయారవుతారు.

మనిషి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది. కావున ఆరోగ్యంగా ఉండాలన్న, అందంగా ఉండాలన్న రోజూ ఖచ్చితంగా 7-9 గంటలు నిద్రపోవడం వలన హెల్దీ బ్యూటీ మీ సొంతం అవుతుంది.

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండి, ఉప్పు, చక్కెర తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు అందంగా ఉంటారు.

రోజూ కొబ్బరి నీళ్ళు, గ్రీన్ టీ తాగడం వల్ల పొటాషియం, మాగ్నీషియం వంటి ఖనిజ లవణాలు శరీరానికి అంది పొడిబారిన చర్మం వంటి సమస్యలను దూరం చేస్తుంది. 

ఇలా శరీరానికి సరిపడా నీరు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల వయసు సంబంధిత ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతూ సహజ మెరుపుని పొందుతారు.