పెళ్లి కోసం రైలు కోచ్ బుక్ చేసుకోవాలా.? ప్రాసెస్ ఇదే..
06 September 2025
Prudvi Battula
భారత రైల్వే టికెట్ బుకింగ్ విధానాన్ని సరళతరం చేస్తోంది. ఈ విధానంతో టికెట్లు చాలా వేగంగా, సులభంగా బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఉన్న సిస్టమ్ కంటే నాలుగు రెట్లు వేగంగా టికెట్లు పొందవచ్చు. ముఖ్యంగా పండుగలు, సెలవుల వంటి రద్దీ సమయాల్లో కుటుంబసభ్యులతో, ఫ్రెండ్స్‌తో వెళ్లేందుకు వీలవుతుంది.
పెళ్లి కోసం లేదా ఎక్కడికైనా వెళ్లడానికి చాలా మంది రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. దీన్ని గ్రూప్ బుకింగ్ అంటారు.
గ్రూప్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి లేదా ఒకేసారి 6 కంటే ఎక్కువ మందికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి రైల్వేలు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందించవు.
దీని కోసం, మీరు CRS అంటే చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ లేదా డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌కి దరఖాస్తును సమర్పించాలి.
రైలులో జర్నీ చేద్దామనుకొంటున్న ప్రయాణికులకు సంబంధించిన అన్ని అవసరమైన సమాచారాన్ని దరఖాస్తులో ఇవ్వాల్సి ఉంటుంది.
ట్రాఫిక్ లైట్ అనేది కూడళ్లు, క్రాసింగ్‌ల వద్ద సిగ్నలింగ్ పరికరం. ట్రాఫిక్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, సంబంధిత అధికారి టికెట్ అధికారితో మాట్లాడి, టికెట్ జారీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తారు.ఏర్పాటు చేసిన లైట్లు.
అయితే, గ్రూపుగా ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి, వేర్వేరు అధికారులను సంప్రదించి, ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.