తగ్గువ బడ్జెట్‎లో ఫారిన్ టూర్‎కి ఈ దేశాలు బెస్ట్ ఆప్షన్.. 

03 May 2025

Prudvi Battula 

నేపాల్: పొరుగు దేశమైన ఇక్కడ తక్కువ ధరకే వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తుంది. భారతీయ పౌరులకు వీసా అవసరం లేదు.

శ్రీలంక: భారతదేశం నుంచి విమాన ప్రయాణం ద్వారా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. బడ్జెట్ వసతి, చౌక రవాణా, సరసమైన ఆహార ఎంపికలను అందిస్తుంది.

భూటాన్: ఈ దేశం భారతీయులకు వీసా లేకుండా సందర్శించే అవకాశాన్ని అందిస్తుంది. జీవన వ్యయం చాలా తక్కువ. బడ్జెట్ వసతి, సులభమైన స్థానిక రవాణా అందుబాటులో ఉంటాయి.

థాయిలాండ్: ఇది తక్కువ ధర హోటళ్ళు, వీధి ఆహారం, బడ్జెట్ రవాణాకు ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుంచి విమానాలు కూడా చాలా సరసమైనవి.

ఇండోనేషియా: బాలి భారతీయులకు అత్యంత సరసమైన అంతర్జాతీయ గమ్యస్థానాలలో ఒకటి. బడ్జెట్ ఎయిర్‌లైన్స్, చవకైన వసతి, స్థానిక ఆహారం తక్కువగా ఉంటుంది.

వియత్నాం: ఇక్కడ సంస్కృతి, అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఆహారం, వసతి, రవాణా ఖర్చులు చాలా తక్కువగా ఉంటుంది.

మలేషియా: ఈ దేశం బడ్జెట్ హోటళ్లు, ఆహారం, ప్రజా రవాణా వరకు విస్తృత శ్రేణి సరసమైన ప్రయాణ ఎంపికలను అందిస్తుంది.

కంబోడియా: ఇది భారతదేశం నుంచి అత్యంత అందమైన, చౌకైన అంతర్జాతీయ గమ్యస్థానాలలో ఒకటి. ఇక్కడ ప్రయాణం, ఆహారాం, హోటళ్లు తక్కువ ఖర్చుతోనే లభిస్తాయి.