చాణక్యనీతి : మిమ్మల్ని దురదృష్టవంతులను చేసే 3 అలవాట్లు ఇవే!
samatha
14 march 2025
Credit: Instagram
ఆచార్యా చాణక్యుడు అత్యంత జ్ఞానవంతుడు, గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి మానవవాళికి ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియజేశారు.
ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్, ప్రేమ, పెళ్లి, బంధాలు, భార్య భర్తల సంబంధం ఇలా ఎన్నో విషయాల గురించి ఆయన వివరంగా తెలిపారు.
అయితే ఒక వ్యక్తి కొన్ని చెడు అలవాట్లకు బానిసైతే అతను జీవితంలో సక్సెస్ కాలేడు అంటూ చాణక్యుడు తన పుస్తకంలో తెలిపారు.
కాగా, అసలు ఒక వ్యక్తి ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. దేనీ వలన వ్యక్తి జీవితంలో సమస్యలను, కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం సమయం విలువ తెలియని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడంట. సమయానికి విలవనివ్వని వ్యక్తి సక్సెస్ కోసం పోరాడి ప్రయోజనం లేదు అంటున్నారు ఆయన.
సోమరితనం ఒక వ్యక్తికి ఉండే చెడు అలవాట్లలో ముఖ్యమైనది. ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ సోమరిగా ఉండాటాడో అతడు తన జీవితంలో పైకి ఎదగడం కష్టమేనంట.
మాట్లాడటం అనేది దేవుడిచ్చిన గొప్పవరం. అయితే కొంత మంది తమకు నచ్చినట్లు మాట్లాడి ఇతరులను బాధపెడుతారు.చాణక్య నీతి ప్రకారం, మీరు జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే, మీరు మధురమైన స్వరంలో మాట్లాడాలి.
అలాగే మర్యాదగా ఉండాలంట. ఈ రెండు విషయాలు జీవితంలోని ప్రతి మలుపులోనూ మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. మీ మాటలు మధురంగానూ, మీ స్వభావం మర్యాదగానూ ఉంటే మీకు శత్రువులు ఉండరు. అలాంటి వారు విజయం సాధిస్తారంట.