వామ్మో పాత పిల్లోస్ వాడితే ఇన్ని సమస్యలా?
Samatha
22 August 2025
Credit: Instagram
మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తప్పకుండా 7 గంటలు నిద్ర పోవాలని చెబుతారు నిపుణులు.
ఇక మంచి నిద్ర కోసం బెడ్ రూమ్ చాలా నీట్‌గా పెట్టుకుంటారు. అలాగే చాలా మంది తప్పకుండా దిండును కూడా వాడుతారు.
కొంత మందికి అయితే అసలు దిండు లేనిదే నిద్ర పట్టనే పట్టదు అంటుంటారు. తప్పనిసరిగా తల కింద పిల్లో పెట్టుకొనే
నిద్ర పోతారు.
అయితే పిల్లో పెట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ఒకే దిండును ఎక్కువ రోజులు వాడకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.
పాత దిండుల్లో దుమ్ము, ధూళి, చిన్న పురుగులు, కంటికి కనిపించని బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇది చర్మ సమస్య
లు, అలెర్జీ, ఆస్తమాకు కారణం అవుతుంట.
అలాగే, పాత దిండ్లను ఎక్కువగా వాడటం వలన అవి కాల క్రమేనా వాటి ఆకారం, సపోర్టును కోల్పోతాయి. దీని వలన మెడ నొప్పి, తలనొప్పి వంటి సమస్యలను తీసుకొస్తాయి.
అంతే కాకుండా నిద్రకు కూడా ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఓల్డ్ పిల్లోస్‌ను ఎక్కువ రోజులు వాడకూడదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
వీలైనంత వరకు సంవత్సారానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి దిండును మార్చుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : గప్ చుప్..మనసులోని మాట ఎవరికి చెప్పకూడదో తెలుసా?
టమాటో రసం టేస్టీనే కాదండోయ్..దీంతో పుట్టెడు లాభాలు!
ఇంటలీజెన్స్ వ్యక్తుల్లో ఉండే మంచి అలవాట్లు ఇవే.. మీలో ఉన్నాయా?