ఆరోగ్యానికి మంచిదని వెల్లుల్లి ఎక్కువ తింటున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!
Samatha
19 august 2025
Credit: Instagram
వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే తప్పకుండా ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవాలని చెబుతుంటారు వైద్యులు.
అంతే కాకుండా వెల్లుల్లిని ప్రతి రోజూ తినడం వలన ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుందని, శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతుంటారు.
అయితే వెల్లుల్లితో అనేక లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వలన రక్తపోటు బాగా తగ్గుతుందంట. అయితే ఇది శరీరానికి చాలా ప్రమాదకరం అందుకే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినకూడదంటున్నారు నిపుణులు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వలన కొన్ని సార్లు జీర్ణక్రియ సాజావుగా సాగక, కడుపునొప్పి వంటి సమస్యలు దరి చేరే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.
అదే విధంగా కొంత మందికి వెల్లుల్లి తింటే పడదు. దీంతో వారిలో గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే అలాంటి వారు వెల్లుల్లి తినకూడదంట.
కొంత మందికి వెల్లుల్లి తింటే అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి వారు వెల్లుల్లి తినకపోవడమే మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ఖాళీకడుపుతో వెల్లుల్లి తినడం వలన కొంత మందికి విపరీతమైన కడుపు నొప్పి, గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.