గసగసాలు చిన్నవే కానీ చేసే మేలు మాత్రం చెప్పలేనిది!

16 october 2025

Samatha

గసగసాలు తెలియని వారు ఎవరూ ఉండరు. వీటిని ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చూస్తే చిన్నగా కనిపించే ఈ సుగంధ ద్రవ్యాలు, శరీరానికి చాలా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.  కాగ గసగసాలు వలన కలిగే ప్రయోజనాలు  ఇప్పుడు చూద్దాం.

గసగసాలను పడుకునే ముందు తీసుకోవడం వలన ఇవి మానసిక ప్రశాంతతను అందిస్తాయంట. అంతే కాకుండా, మంచి నిద్రను ప్రేరేపిస్తాయంటున్నారు నిపుణులు.

ఎముకల ఆరోగ్యానికి గసగసాలు చాలా మంచివి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన గసగసాను ప్రతి రోజూ పాలల్లో తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.

జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో గసగసాలు కీలకంగా వ్యవహరిస్తాయి. గసగసాలను రోజూ తీసుకోవడం వలన ఇది మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

గసగసాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని మీరు మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇవి కడుపును శుభ్రం చేసి, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా గసగసాలు చాలా మంచిది. ఇందులో ఓమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ముఖ్యంగా రక్తపోటు నియంత్రించడంలో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. గసగసాలు తీసుకోవడం వలన ఇవి కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.