చేపలు తిన్న తర్వాత అస్సలే తినకూడని ఆహార పదార్థాలు ఇవే !

samatha 

07  JUN  2025

Credit: Instagram

మృగ శిర కార్తె వచ్చేసింది. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ చేపలు తింటారు. అంతే కాకుండా పెద్ద వారు కూడా నేడు చేపలు తినాలంటారు.

అయితే కొంత మంది చేపలు తిన్న తర్వాత కొన్ని ఆహారపదార్థాలు తీసుకొని సమస్యలు కొనితెచ్చుకుంటారు. కాగా, చేపలు తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు తిన్న తర్వాత అస్సలే పాలు తాగకూడదంట. దీని వలన జీర్ణ సంబంధపరమైన సమస్యలు తలెత్తుతాయంట. అందుకే చేపలు తిన్న తర్వాత అస్సలే పాలు తాగకండి.

అదే విధంగా చేపలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పెరుగు, మజ్జిగ తీసుకోకూడదంట. దీని వలన ఇది విషపూరితమ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. చర్మ వ్యాధులు కూడా వస్తాయంట.

కొంత మంది చేపల కర్రీ లేదా ఫిష్ రెసిపీస్ తిన్న తనకవాత టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ చేపలతో పాటు కెఫిన్ కలిసి పోయి ఇది శరీరానికి హానికలిగిస్తుందంట.

అదే విధంగా కొంత మంది చేపలు తిన్న తర్వాత వెంటనే చికెన్ తింటుంటారు. అయితే అస్సలే చేపలు తిన్న తర్వాత చికెన్ తినకూడదంట. ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుందంట.

అదే విధంగా కొంత మంది చేపలు తిన్న తర్వాత వెంటనే చికెన్ తింటుంటారు. అయితే అస్సలే చేపలు తిన్న తర్వాత చికెన్ తినకూడదంట. ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుందంట.

అలాగే చేపలు తిన్న తర్వాత కొంత మంది స్వీట్స్ తింటుంటారు. అయితే ఫిష్ తిన్న తర్వాత స్వీట్స్ తినడం వలన అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదు అని సూచిస్తున్నారు వైద్యులు.