కారణం లేకుండా కడుపు నొప్పి వస్తుందా..వామ్మో ఇది పెద్ద సమస్యే!
10 october 2025
Samatha
కడుపు నొప్పి రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కడుపు నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇది చాలా సహజం.
ఎందుకంటే కొంత మంది తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన లేదా ఏదైనా శరీరానికి పడని ఆహారం తినడం వలన కడుపు నొప్పి వస్తుంది.
కానీ కొంత మందిలో ఎలాంటి కారణం లేకుండా తరచుగా కడుపు నొప్పి అనేది వస్తుంది. దీంతో చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఇది చాలా ప్రమాదకరం కూడా కావచ్చునంట.
కడుపు నొప్పి అనేది ఎక్కువగా వేయించిన ఆహారాలు, కారం, ఫాస్ట్ ఫుడ్ తినడం వలన కడుపులో గ్యాస్ ఏర్పడి గుండెల్లో మంట , కడుపు నొప్పి వస్తుంటుంది.
ఇంకొన్ని సార్లు కడుపు లేదా పేగుల పొరలో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. కొన్ని సార్లు ఇది చాలా తీవ్రంగా, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది.
అలాగే కొన్నిసార్లు కడుపు నొప్పి అనేది ఫుడ్ పాయిజనింగ్, లేదా వైరస్, జ్వరం వంటి వాటి వలన కడుపు నొప్పిరావడం జరుగుతుంది. ఇది చాలా సహజమైనది.
కొందరిలో అపెండిసైటిస్ సమస్యల వలన కడుపు నొప్పి అనేది వస్తుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు అకస్మాత్తుగా నొప్పి చాలా ఎక్కువ అవుతుంది. ఆకలి మందగిస్తుంది.
పిత్తాశయంలో రాళ్లు కూడా కడుపునొప్పిని కలిగిస్తాయి. అందువలన పదే పదే కడుపు నొప్పి వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంట. లేకపోతే అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉన్నదంటున్నారు నిపుణులు.