ఏంటీ పంటి నొప్పి బాధపెడుతుందా.. మీ కోసమే ఈ ఇంటి చిట్కాలు !
10 october 2025
Samatha
పంటి నొప్పి అనేది చాలా మందిని వేధిస్తుంటుంది. పంటి నొప్పి సమస్యలు ఉన్నవారు ఆహారం తీసుకోవడంలో కూడా అనేక సమస్యలు ఎదుర్కుంటారు.
అయితే పంటి నొప్పితో బాధపడేవారు ఎలాంటి నియమాలు పాటించాలి. ఇంటిలోనే సులభంగా పంటి నొప్పిని తగ్గించుకోవడానికి బెస్ట్ చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
పంటి నొప్పితో బాధపడే వారు మొదటగా లైన్ గా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ డ్రగ్స్ ఉపయోగించడం మంచిదంట. ఇది ఎక్కువ ప్రమాదాన్ని చూపకుండా నొప్పిని నివారిస్తుంది.
ఇక కొంత మందిలో ఎన్ని మందులు వాడినా అస్సలే పంటి నొప్పి అనేది తగ్గదు. ఆ సమయంలో నొప్పి ఎలా ఉందో గమనించి, తీవ్రంగా ఉంటే చికిత్స తీసుకోవడం మంచిదంట.
అలాగే పంటి నొప్పితో బాధపడే వారు ఆ నొప్పి ఉన్న వైపున నమలడం లేదా వేడి పానీయాలు తాగడం, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం అస్సలే చేయకూడదంట.
పంటి నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో, వారు గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు, సాల్ట్, ఒక లవంగం వేసి, ఆ నీటిని మరగ బెట్టాలి. అవి గోరు వెచ్చగా అయిన తర్వాత వాటిని నోటిలోకి తీసుకొని పుక్కిలించాలంట.
అదే విధంగా పంటి నొప్పి మిమ్మల్ని వేధిస్తున్న సమయంలో కోల్డ్ కంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిదంట. నొప్పి ఉన్న స్థానంలో కోల్డ్ కంప్రెస్ పెట్టడం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే పంటి నొప్పి ఎప్పుడు వస్తుంది. ఎంత సేపు ఉంటుంది. ఏ సమయంలో తీవ్రతరం అవుతుంది అనే విషయాలను కూడా గమనించి, నొప్పి తీవ్రతరం అయినప్పుడు వైద్యుడికి ఈ విషయాలు తెలపాలి.