వర్షకాలంలో దాహం వేయకున్నా ఎక్కువ నీరు తాగాలంటారు ఎందుకో తెలుసా?

samatha 

19 JUN  2025

Credit: Instagram

వర్షాకాలం ప్రారంభమైంది. చాలా చోట్ల చిరు జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. వర్షలు ప్రారంభం కావడంతో చాలా మంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు

అయితే వర్షకాలంలో చాలా వరకు తక్కువ దాహం వేస్తుంది. అంతే కాకుండా అసలు నీరు తాగాలని అనిపించదు. దీంతో కొందరు నీరు తాగరు.

కానీ వర్షకాలంలో ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

చల్లటి వాతావరణం కావడంతో దాహం అనిపించదు కానీ శరీరం ద్రవాలను కోల్పోతుంది. దీని వలన అసలట,శరీరం పొరిబారడం వంటి సమస్యలు వస్తాయంట.నీరు తాగాలంట.

అలాగే నీరు మూత్ర పిండాల పనితీరుకు మద్ధతు ఇస్తుంది. వ్యర్థాలను తొలిగించడానికి సహాయపడుతుంది. అందుకే ఈ సీజన్‌లో ఎక్కువ నీరు తాగితే,అది వర్షకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందంట.

మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై, జీర్ణక్రియ సాఫీగా సాగిపోవాలంటే తప్పకుండా ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవాలంట.

ఎక్కువగా నీరు తాగడం వలన అది శరీరంలోని చెడు బ్యాక్టీరియాను బయటకు పంపి, కడుపు ఉబ్బరం వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వర్షకాలంలో చర్మం చాలా తేమగా ఉంటుంది. దీని వలన అనేక బ్యాక్టీరియల్ ఇఫన్ఫెక్షన్స్ ప్రమాదం ఉంది. కాబట్టి నీరు తాగడం వలన ఆ సమస్య నుంచి బయటపడవచ్చునంట.