ప్రాణాయామంతో ప్రాణం పదిలం.. ప్రతి రోజూ చేస్తే ఎన్ని ప్రయోజనాలో!

samatha 

16 JUN  2025

Credit: Instagram

ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాలు ప్రాణాయామం చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

ప్రాణాయామం చేడం వలన ఊపితిత్తుల పనితీరు మెరుగు పడటమే కాకుండా, శాసకోశ  కండరాలను బలోపేతం చేసి శ్వాస సాఫీగా సాగేలా చేస్తుందంట.

ప్రతి రోజూ శ్రద్ధగా ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడి , ఆందోళన నుంచి బయటపడవచ్చునంట. అలాగే ఇది హృదయస్పందన రేటును మెరుగుపరుస్తుందంట.

ప్రాణాయామం మెదుకు ఆక్సిజన్ అందించి రక్తప్రవాహాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం మంచిదంట.

ప్రాణాయామం నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతంది. అంతే కాకుండా ఇది మానసిక స్థితిని పెంచే సెరోటోనిన్ ,డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుందంట.

ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాలు ప్రాణాయామం చేయడం వలన జీర్ణక్రియ జీవక్రియ మెరుగుపడుతుందంట. జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుందంట.

ప్రాణాయామం వలన గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు తగ్గడం, ఒత్తిడితో సంబంధం ఉన్న హృదయ స్పందన రేట తగ్గించడం, రక్తంలో ఆక్సిజన్ మెరుగుపరుస్తుందంట.