ఇంటికే కల తీసుకొచ్చే బ్యూటిపుల్ ఫ్లాట్స్ ఇవే.. మీ ఇంట్లో ఉన్నాయా మరి!

Samatha

28 August  2025

Credit: Instagram

ఎంత చిన్న ఇల్లు అయినా మంచిదే, దానిని ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటే అంత బాగుంటుంది. చూడటానికి బాగా కనిపిస్తుంది.

చాలా మంది ఇల్లును అందంగా మార్చుకోవడానికి ఏవో ఏవో డెకరేషన్స్ చేస్తారు. కానీ అవి ఏవీ లేకుండా ఇంట్లో అందమైన చెట్లును పెడితే అద్భుతంగా ఉంటుంది.

ముఖ్యంగా ఐదు మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఇళ్లుకు లగ్జరీ లుక్ రావడమే కాకుండా.. మన ఇళ్లు అదిరిపోతుందంట. మరి ఆ మొక్కలు ఏవి అంటే?

ఇంగ్లీష్ ఐవీ ఫ్లాంట్.. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. దట్టమైన ఆకులతో ఉండే ఈ మొక్కను, లివింగ్ రూమ్, బెడడ్ రూమ్ వద్ద వేలాడదీస్తే సూపర్ లుక్ వస్తది.

తెలుపు, ఆకుపచ్చ వర్ణం కలిగి, పొడవైన ఆకులతో అందంగా ఉండే మొక్కల్లో స్పైడర్ ప్లాంట్ ఒకటి. దీనిని బాల్కానీ లేదా వండ గది వద్ద పెట్టడం వలన మంచి లుక్ ఉంటది.

మీ ఇల్లు చూడగానే అద్భుతంగా కనిపించాలంటే, మనీ ప్లాంట్ మొక్కను ఇండోర్ హ్యాంగింగ్ బాస్కెట్ లో పెట్టి గోడకు వేలాడదీస్తే ఇది ఇంటికి అందమైన లుక్ ఇస్తుంది.

స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ మొక్క. ఇది గుండ్రటి ఆకులను మత్యాల లాంటి మొగ్గలతో చిన్న పూలతో అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కను లివింగ్ రూమ్ వద్ద పెట్టుకుంటే బాగుంటుంది.

బొస్టన్ ఫెర్న మొక్క పెద్ద ఆకులతో గుబురుగా అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కను చెక్క హ్యాంగర్  లేదా వాల్ బ్రాకెట్ నుంచి వేలాడదీసి ఇంటి గార్డెన్ ప్లేస్ లో పెట్టాలి.