వీటిని మళ్లీ చూడలేమేమో.. కనుమరుగయ్యే దశలో ఉన్న జంతువులివే!

samatha 

16 JUN  2025

Credit: Instagram

మంచు చిరుత. ఇది ఎక్కువ దక్షిణ ఆసియాలో ఎత్తైన పర్వాతలలో ఉంటుంది. అయితే ఇది అంతరించిపోయే జంతువుల్లో ఒకటి ఎందుకంటే పర్వతాల్లో వేటాడం, ఆవాసాలను కోల్పోవడం వల్ల ముప్పు పొంచి ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా రవాణా చేయబడే క్షీరదాల్లో పాంగోలిన్ ఒకటి. దీని మాంసం రుచికరంగా ఉంటుంది. దీని పొలుసలను వైద్యరంగంలో ఉపయోగిస్తారు. అయితే ఇది అంతరించిపోయే స్టేజ్‌లో ఉన్నదంట.

ఖడ్గమృగాలంలో జావాన్ ప్రత్యేకతే వేరు. ఇండోనేషియాలో మాత్రమే కనిపించే ఇవి, ప్రస్తుం కేవలం 70 మాత్రమే మిగిలి ఉన్నాయని, వ్యాధి వలన ఇవి అంతరించిపోతున్నట్లు తెలుస్తుంది.

అముర్ చిరుతపులులు కూడా కనుమరుగు అయ్యేలా ఉన్నాయంట. అడవిలో చైనా, రష్యన్ ఈస్ట్ అంచున ఉన్న ఫారెస్ట్‌లో ఇవి కేవలం 120 కంటే తక్కువే ఉన్నాయంట.

ఎర్రపాండా ఇవి చాలా క్యూట్‌గా ఉంటాయి. హిమాలయ పర్వతాల్లో ఎక్కువ కనిపిస్తాయి. అయితే అటవీ నిర్మాల, వేటాడం వలన ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఎగరలేని చిలుక అంతరించిపోతున్న పక్షుల్లో ఒకటి. దీనిపేరు కాకాపోని ఇది చాలా బరువైని, మానవ స్వరాన్ని సులభంగా అనుకరిస్తుంది.

వాక్విటా ఫిష్, మెక్సికోలోని కాలిఫోర్నియా గల్ఫ్ నుంచి వచ్చిన ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ ఇవి 10 కంటే తక్కువ ఉన్నట్లు సమాచారం.

ఆసియన్ యునికార్న్ అని పిలవబడే సావోలా జంతువు. ఇది చూడటానికి జింకలానే కనిపిస్తుంది. అయితే అంతరించిపోతున్న జంతువుల్లో ఇది కూడా ఒకటి.