అవకాడో తినడానికి కొందరు ఇష్టపడరు. కానీ దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, ఫోలేట్, లుటీన్ జియాక్సంతిన్, ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అవకాడోలో అనేక రకమైన ప్రోటీన్స్, ఖనిజాలు ఉండటం వలన ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడి, దాని పనితీరును మెరుగు పరుస్తుందంట.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి కొలెస్ట్రాల్స స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయంట.
ఇందులో లుటీన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉండటం వలన ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి రోజూ అవకాడో తినడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేయడమే కాకుండా, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తుంది.
అవకాడోలో ఉండే సహజ లుటీన్ , జియాక్సంతిన్ కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, ఎముకలను దృఢంగా చేస్తుంది.
అధిక బరువుతో బాధపడే వారు దీనిని ప్రతి రోజూ తమ డైట్‌లో చేర్చుకోవడం వలన త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉన్నదంట.