ఒత్తిడి నుంచి బయటపడటానికి చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే!
Samatha
28 october 2025
ఆచార్య చాణక్యుడు అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా పేరుగాంచారు. ఈయన గొప్ప పండితుడు. అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అలాగే ఆయన ఒత్తిడి నుంచి బయటపడటానికి కూడా కొన్ని విషయాలను తెలియజేశాడు. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
మీరు మీ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే తప్పకుండా చాణక్యుడి మూడు సూత్రాలు పాటించాలంట. అవి మీ జీవితంలో శాంతికి కారణం అవుతాయి.
ప్రతి వ్యక్తి పోరాడే సమయంలో మనశ్శాంతిని కోల్పోతాడు. కాబట్టి కొన్ని సార్లు పోరాడినా ఫలితం ఉండదు అనేటప్పడు, ఆవిషయాన్ని అంగీకరించడం నేర్చు కోవాలంట.
ఒత్తిడి అనేది బయటకు రాదు, అది మనలోనే ఉండి, మనసులో ఆందోళనలు, భయాలను పుట్టిస్తు్ంది. అందువలన మీరు మీ ఆలోచనలు నియంత్రించుకోవాలి.
ప్రతి రోజూ మీతో మీరు మాట్లాడుకోవాలి. నిశ్శబ్దం కాసేపు కూర్చొని, మౌనంగా ఉండండి. తర్వాత మీకు మీరే ఏదో మంచి విషయాలను గుర్తు చేసకొని, మీకు మీరే మనసులో మాట్లాడుకోండి.
అలాగే, రోజూ వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం చేయాలి. అంతే కాకుండా ఆందోళన సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం వలన కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.