రోజూ 10 నిమిషాలు యోగ చేస్తే.. బాడీలో ఆరోగ్యనికి ఇల్లు కట్టినట్టే..
07 September 2025
Prudvi Battula
రోజూ ఉదయం పది నిమిషాలు స్లో స్ట్రెచ్ చేసి, లోతైన శ్వాస తీసుకోవడం వల్ల శరీరం స్థిరంగా మరి మనస్సు తేలికగా అనిపిస్తుంది.
ఉదయాన్నే సింపుల్ ప్రాణాయామ చేస్తే ఊపిరితిత్తు ఉత్తేజం అవుతాయి. ఇది ఆక్సిజన్ మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
రాత్రి విశ్రాంతి తర్వాత కండరాల బిగుతుకు హెచ్చరికలా ఉదయం యోగా పనిచేస్తుంది. ఇది ఉదయం శరీర నొప్పులను తగ్గిస్తుంది.
తెల్లవారుజామున కొన్ని ఆసనాలు మానసిక అస్పష్టతను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి ఆలోచనలు కలిగేలా మెదడును పదునుగా ఉంచుతుంది.
సాధారణంగా ఉదయం ఒత్తిడికి కారణం అయ్యే కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. పది నిమిషాల యోగా దీన్ని తగ్గించి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది.
ట్విస్టులు, ఫార్వడ్ బెండులు వంటి కొన్ని ఆసనాలు ఉదరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. రోజంతా అసౌకర్యాన్ని నివారిస్తుంది.
ప్రతి ఉదయం యోగా సాధన చేయడం వల్ల వెన్నెముక సమతలంగా ఉండేలా శిక్షణ లభిస్తుంది. దీనివల్ల కూర్చోవడం, నడవడం సులభతరం అవుతుంది.
ప్లాంక్, బోట్ వంటి సులభమైన భంగిమలను కూడా కొన్ని సెకన్లు వేస్తే బలమైన కోర్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. నడుము దిగువ భాగాన్ని రక్షిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..