పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అదేనట..!
Prudvi Battula
Images: Pinterest
24 October 2025
దేశంలో ప్రతి లక్ష మందిలో 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) సర్వేలు తెలిపాయి.
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
ఆత్మహత్యల జాబితాలో 70శాతం పురుషులే ఉన్నారని వెల్లడైంది. మహిళలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. వారిలో 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గలవారే ఉన్నారు.
70శాతం పురుషులే
దేశంలో పురుషుల ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష మంది పురుషులకు 12.8 కాగా, అదే మహిళల విషయానికి వస్తే.. 7.3గా ఉంది.
ఆత్మహత్యల రేటు
పురుషుల ఆత్మహత్యలకు 18శాతం ఆర్థిక ఒత్తిడి కారణమని తేలింది. 33శాతం కుటుంబ కలహాలు కారణంగా మహిళల ఆత్మహత్యలు చేసుకుంటారని తేలింది.
ఆర్థిక ఒత్తిడి
నిరుద్యోగం ,ఆర్థిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, వైవాహిక సంబంధాలు తెగిపోవడం, మద్యం ,మత్తు పదార్థాలకు బానిసలై, పట్టణ జీవనశైలిలో ఒత్తిడి, ఒంటరితనం కూడా కారణం.
కారణాలు
ఉద్యోగాలు రాలేదని కొందరు, ఆర్థికంగా దివాళా తీసి ఇంకొందరు, కుటుంబ కలహాలు, వైవాహిక జీవితంలో కలతల కారణంగా మరికొందరు ఆత్మహత్యలు తీసుకుంటున్నారు.
ఇతర కారణాలు
అస్సాం, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు పదిలక్షల మందితో ఈ సర్వే జరిగింది.
పదిలక్షల మందితో సర్వే
జనవరి 2019 నుంచి డిసెంబర్ 2022 2లక్షల 40వేల 975 గృహాలలో సర్వే చేసి మొత్తం 29వేల 273 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కించారు.
గృహాలలో సర్వే
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..