ఆకారంలో నక్షత్రం.. లాభాల్లో సూపర్ స్టార్.. స్టార్ ఫ్రూట్‎తో అనారోగ్యం ఖతం.. 

Prudvi Battula 

Images: Pinterest

23 November 2025

స్టార్ ఫ్రూట్‎లోవిటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి బలోపేతం

స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.

గుండెకి మేలు

ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.

బరువు తగ్గడానికి మంచి ఎంపిక

ఇది జీర్ణక్రియను సజావుగా సాగేలా చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను ప్రోత్సహించి ప్రేగు కదలికలను పెంచుతుంది.

ప్రేగు కదలికలను పెంచుతుంది

స్టార్ ఫ్రూట్‌లోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదించి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.

చక్కెర స్థాయిలు కంట్రోల్

దీనిలో విటమిన్ సి అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది

ఇందులో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు దృష్టిని మెరుగుపరచడంలో, మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కంటికి ఆరోగ్యం

స్టార్ ఫ్రూట్ సహజ మూత్రవిసర్జనను పెంచడం ద్వారా శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది.

విషాన్ని బయటకు పంపుతుంది