జర భద్రం.. పెరగనున్న పాము కాట్లు, జాగ్రత్తలేకపోతే బండి షెడ్డుకే!

04 September 2025

Samatha

పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరంలో పారిపోతుంటారు.

ఇక ఇవి ఎక్కువగా చిత్తడి ఉన్న దగ్గర కనిపిస్తుంటాయి. అలాగే పంట పొలాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే తాజాగా ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి అయ్యాయి.

అది ఏమిటంటే? భారత దేశంలో పాముకాట్లు పెరగనున్నాయంట. అందుకే ప్రజలు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వాతావరణంలో మార్పుల కారణంగానే దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పాము కాట్లు పెరగనున్నదంట.

భారత దేశంలోని అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌తో పాటు, హరియాణా, రాజస్థాన్, బిహార్‌లో ఈ ప్రమాదం ఎక్కువ ఉన్నదంట.

ఇక్కడి వాతావరణమే దీనికి కారణం అంటున్నారు నిపుణులు, ఈ ప్రాంతాల్లో కింగ్ కోబ్రాలతో పాటు, నాలు రకాల ప్రమాదకర పాములు ఎక్కువ ఉన్నాయంట.

అంతే కాకుండా, అక్కడి వాతావరణం ఎప్పుడూ వేడిగా, ఉక్కపోతగా ఉండటంతో అవి తమ ఆవాసాలి వదిలి, వేరు ప్రాంతాలకు వెళ్లే ఛాన్స్ ఉన్నదంట.

దీని కారణంగా ఈ రాష్ట్రాల్లో పాము కాట్ల ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని అధ్యాయన నిపుణులు తెలియజేయడం జరిగింది.