సొరకాయలో బోలెడన్ని పోషకాలుంటాయి. నీటి శాతం కూడా ఎక్కువ. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఎండాకాలంలో మంచిది.
ఒక సొరకాయలో దాదాపు 92 శాతం నీరే ఉంటుంది. దీంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. త్వరగా జీర్ణమైపోతుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజూ సొరకాయలు తింటే చాలు. ఆరోగ్యకరంగా, సులువుగా బరువు తగ్గిపోవచ్చు. సొరకాయల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మిగతా చిరుతిళ్లపై మనసు మళ్లదు. అలా క్రమంగా బరువు తగ్గేందుకు అవకాశముంటుంది.
సొరకాయలో పొటాషియం, మెగ్నీషియం అధిక పాళ్లలో ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్నీ కాపాడతాయి. ఇది నేచురల్ డిటాక్సిఫయర్.
మహిళల్లో వచ్చే యూరిన్ ఇన్ ఫెక్షన్లను తగ్గించడంలోనూ సొరకాయ బాగా పని చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ని శుభ్రం చేసి ఇన్ ఫెక్షన్లను అరికడుతుంది. ఒత్తిడిని తగ్గించేస్తుంది.
సొరకాయలో కొలైన్ ఉంటుంది. ఇది మెదడుని రిలాక్స్ చేసేస్తుంది. ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలనూ దూరం పెడుతుంది. వేసవిలో ఎక్కువగా తినడం మరింత మంచిది.
సొరకాయను కూర రూపంలోనే కాకుండా జ్యూస్ లా తీసుకున్నా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కొంత మంది సొరకాయ ని సూప్ రూపంలో తీసుకుంటారు.