అరటిపండు తిన్న వెంటనే టీ తాగితే.. అంతే సంగతులు..
12 October 2025
Prudvi Battula
అరటిపండుతో శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ఇది రోజు తినడం మంచిదని చాలామంది డాక్టర్స్ కూడా చెబుతుంటారు.
అలాగే టీ తాగడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. అయితే మరి ఎక్కువ తాగితే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.
కొంతమంది అరటిపండు తిన్న వెంటనే టీ తాగుతుంటారు. ఇలా చెయ్యడం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అరటిపండ్లు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. టీలో టానిన్లు ఉంటాయి. ఇవి కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా కడుపు నొప్పి వంటి జీర్ణ అసౌకర్యం కలుగుతుంది.
టీలోని టానిన్లు అరటిపండు నుండి పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటిని కలిపి తీసుకోకూడదు.
కొంతమందికి అరటిపండు తిన్న వెంటనే టీ తాగితే అలెర్జీ వస్తుంది. ఇది దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది.
అరటిపండు తిన్న వెంటనే టీ తాగే అలవాటు మితంగా ఉంటే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎక్కువ అయితేనే ప్రమాదం అంటున్నారు.
అందుకే అరటిపండు తిన్న వెంటనే టీ తాగడం వెంటనే మానుకోండి. లేదంటే చాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలా అలంకరిస్తే.. దీపావళి కళ అంతా మీ ఇంట్లోనే..
నల్ల వంకాయ ఆ సమస్యలపై యమపాశం.. అనారోగ్యం ఆమడ దూరం..
బీట్రూట్ జ్యూస్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. అనారోగ్యం పరార్..