మొలల వ్యాధికి దివ్యౌషధం.. ఇలా తీసుకుంటే ఉపశమనం!

Jyothi Gadda

16 March 2025

మొలలు, వీటినే హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి మలద్వారం, పురీషనాళం లోపల వాపు, నొప్పి, రక్తస్రావం కలిగించే సిరలు. ఈ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందిపడుతుంటారు. 

కూర్చోవడం, నడవడం, చివరికి మలవిసర్జన చేయడం కూడా కష్టంగా మారుతుంది. అయితే, శుభవార్త ఏమిటంటే, మనకు ప్రకృతి ప్రసాదించిన ముల్లంగి ఈ సమస్యకు ఒక సహజ పరిష్కారం.

ముల్లంగిలో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలం సులభంగా కదిలేలా చేస్తుంది. తద్వారా మొలలపై ఒత్తిడి తగ్గుతుంది. 

దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 

ముల్లంగిలోని గుణాలు మొలల వల్ల కలిగే వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, మొలల సమస్యలు రాకుండా చూస్తుంది. 

ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ముల్లంగి రసం తాగడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. ముల్లంగిని సన్నగా తురిమి, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీరతో కలిపి తీసుకోవచ్చు. 

ముల్లంగితో కూర, పచ్చడి వంటివి తయారుచేసుకొని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని మెత్తగా పేస్ట్ చేసి, మొలలపై రాయడం వలన నొప్పి , వాపు తగ్గుతాయి.  

దీంతో పాటు రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మలబద్ధకం నివారించబడుతుంది. పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి.

దీంతో పాటు రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మలబద్ధకం నివారించబడుతుంది. పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి.