ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి.. హోటల్‌పై భారీ జరిమానా..
09 September 2025
Prudvi Battula
కోయంబత్తూరుకు చెందిన క్రిస్టోఫర్ ఎడిసన్ వ్యక్తి కుటుంబంతో కలిసి జనవరి 14న ఓ బిర్యానీ హోటల్‌కు వెళ్లాడు.
ఆ రెస్టారెంట్లో సదరు వ్యక్తి తందూరి చికెన్, గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసాడు. తర్వాత వెయిటర్ ఫుడ్ టేబుల్ దగ్గరకి తీసుకొని వచ్చాడు.
ఇక్కడివరకు అంత బాగానే ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. తాను ఆర్డర్ చేసిన గ్రిల్ చికెన్‌లో లెగ్‌పీస్ లేదని సిబ్బందిని ప్రశ్నించాడు.
అయితే వారు తనకు లెగ్‌పీస్ ఎక్కువపోగా హోటల్ సిబ్బంది అతడిని బెదిరించారు. దీంతో వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నయి.
ఇది అంత తన కుటుంబ సభ్యుల ఎదుట జరిగినందున తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానని ఫోరంలో ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదులో హోటల్లో కట్టిన రూ.1,196 బిల్ సహా తన మానసిక క్షోభకు నష్టపరిహారం ఇప్పించాలని క్రిస్టోఫర్ అభ్యర్థించాడు.
ఈ పిటిషన్‌పై ఫోరం విచారణ జరిపి ఆ వ్యక్తిఫై బెదిరింపుకు పాల్పడ్డ ఆ హోటల్ యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించింది.
క్రిస్టోఫర్ ఎడిసన్ కేసు కోసం ఖర్చుచేసిన రూ.5 వేలతో కలిపి మొత్తం రూ.15 వేలు ఆ వ్యక్తికి ఇవ్వాలని ఆదేశించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..