ఆ సమస్యలు ఉన్నవారు మటన్ లివర్‌ తింటే.? బాడీ షెడ్డుకి పోయినట్టే.. 

05 September 2025

Prudvi Battula 

మటన్ లివర్‌తో ఆరోగ్యని మేలు జరుగుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు, బలోపేతానికి ఉపయోగపడుతుంది.

మటన్ లివర్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నందున కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు దీన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.

మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మటన్ లివర్ తినాలి.

మద్యం సేవించినప్పుడు శరీరంలోని కాలేయం (లివర్) దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

మద్యం సేవించినప్పుడు మటన్ లివర్ తింటే, కాలేయంపై మరింత ఒత్తిడి పడి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

మటన్ లివర్‌లోని అధి కొవ్వులు మద్యంతో కలిసినప్పుడు జీర్ణ ప్రక్రియను క్లిష్టంగా మారుతుంది. దీంత గుండెల్లో మంట, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

మద్యంతో పాటు మటన్ లివర్‌ను అధికంగా తీసుకొంటే కాలేయ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరుగుదల వంటి ప్రమాదాలు ఉంటాయి.

ఇప్పటికే కాలేయ వ్యాధులతో బాధపడేవారు ఇలా తినడం పూర్తిగా మానుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.