అస్సలే మద్యం ముట్టుకోకూడని వారు వీరేనంట..తాగితే కథ కంచికే
samatha
19 JUN 2025
Credit: Instagram
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ ఎన్ని ప్రకటనలు చేసినా ఇప్పటికీ మద్యం ప్రియులు మాత్రం మద్యం సేవించకుండా ఉండటం లేదు.
ప్రపంచంలో చాలా మంది మద్యానికి బానిసయ్యారు. ఒక రోజు ఆహారం లేకుండా అయినా ఉంటున్నారు తప్ప మద్యం లేకుండా ఉండటం లేదు.
అంతే కాకుండా ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఇంట్లో పార్టీలు జరిగినా తప్పకుండా మెనూలో మద్యం ఉండటం అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో..
అయితే చాలా మంది మద్యం సేవిస్తారు కానీ, కొంత మంది అస్సలే మద్యం ముట్టుకోకూడదంట. వీరు మద్యం తాగితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఇంతకీ ఎవరు వారంటే?
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతున్న వారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే సమస్యలు వస్తాయంట.
మద్యంలో ఉండే ఆల్కహాల్ మనం శరీరంలో అసిటాల్టి హైడ్ అనే విషపదార్థంగా మారుతుందంట. ఇది చాలా సమస్యలకు కారణం అవుతుందంటున్నారు నిపుణులు.
అదే విధంగా, అధికంగా మద్యం సేవించడం వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే ఇప్పటికే స్ట్రోక్ వచ్చిన వారు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు అస్సలే మద్యం తాగకూడదంట. ఒక వేల తాగినట్లైతే ప్రాణానికేముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదంట.