ఇకపై వారికి OYOలోకి నో ఎంట్రీ.. వెళ్లాలనుకుంటే.. ప్రూఫ్ పక్కా..
08 September 2025
Prudvi Battula
ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ హోటల్ బ్రాండ్‌గా OYOకి పేరుంది. తక్కువ ఖర్చుతో అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.
OYO హోటల్స్ & హోమ్స్ ఒక భారతీయ బహుళజాతి సంస్థ. దీనిని 2012లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. ప్రారంభంలో ప్రధానంగా బడ్జెట్ హోటళ్లపై దృష్టి సారించారు.
దాదాపు ప్రతి నగరంలోనూ OYO హోటళ్లను సరసమైన ధరల్లోనే బుక్ చేసుకోగలిగినప్పటికీ, ఇప్పుడు దాని నియమాలలో కొన్ని మార్పులు చేయడం జరిగింది.
నిజానికి OYO మీరట్‌లోని హోటళ్లకు కొత్త చెక్-ఇన్ విధానాన్ని అమలు చేసింది. తన హోటల్ నిర్వాహకులు పెళ్లికాని జంటలకు గదులు ఇవ్వకుండా OYO నిషేధించింది.
OYO కొత్త నిబంధనల ప్రకారం, మీరట్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో గదిని బుక్ చేసుకునే జంటలు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది.
మీరట్‌తో పాటు, OYO ఇతర నగరాల్లో కూడా క్రమంగా ఈ మార్పును తీసుకురావాలని యోచిస్తోంది OYO హోటల్స్ & హోమ్స్ సంస్థ.
OYO బ్రాండ్ పేరుతో 35 దేశాల్లో 1.8 మిలియన్ల హోటళ్లు ఉన్నయి. ఇవి ఎక్కువగా నగరాల్లో కనిపిస్తాయి. వీటికి ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది.
OYO హోటల్స్ 2025 ఆర్థిక సంవత్సరానికి ₹623 కోట్ల (సుమారు $72 మిలియన్లు) రికార్డు నికర లాభాన్ని, ₹6,463 కోట్ల (సుమారు $775 మిలియన్లు) ఆదాయాన్ని నివేదించింది.