ఈ కాఫీ కాస్ట్ 60 వేలపైనే.. అంత ఎందుకంటే.?

13 October 2025

Prudvi Battula 

చాలామంది కాఫీ అంటే ఇష్టంగా తాగుతారు. ఇది రోడ్ సైడ్ అయితే రూ.15, అదే హోటల్‎లో రూ. 30 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్‎లో రూ. 500 దీని కాస్ట్.

కానీ ఓ కాఫీ ధర ఖరీదు 680 డాలర్లు. మన కరెన్సీలో 60,368 రూపాయలు అన్నమాట. ఈ కాఫీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది.

ఇది దుబాయ్‌లోని రోస్టర్స్‌ కాఫీ. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా రికార్డు సెట్ చేసింది. దీనికి ఇంత ధర ఉండటానికి కారణం ఇందులో వాడే కాఫీ బీన్స్.

దీన్ని వోగ్యుష్‌ కాఫీ అని పిలుస్తారు. ఇది తయారు చేయడానికి అరుదైన పనామా ఎస్మెరాల్డా కాఫీ గింజలను వాడుతారు.

ఈ కాఫీ ఎంతో రుచికరంగా, పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అందుకే చాలామంది కోటీశ్వరులు దీన్ని ఆర్డర్ చేసుకోను తాగుతుంటారు.

కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ, రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందట.

నిశ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉండేవారిలో హృద్రోగ సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు.

అయితే అధికంగా కాఫీ తాగడం ప్రమాదం. దీనిలోని కెఫైన్ అనే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే మోతాదులో తీసుకోవాలి.