గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేస్తోంది!
04 September 2025
Samatha
భారత దేశ రైల్వే ప్రయాణికులు ఎంతగానో ఎదురు చూస్తున్నది వందే భారత్ స్లీపర్ రైలు కోసం. కాగా, తాజాగా దీనిపై మంత్రి గుడ్ న్యూస్ తెలిపారు.
దేశంలోనే మొదటి సారిగా వందే భారత్ స్లీపర్ తీసుకరాబోతున్నాం, సెప్టెంబర్ నెలలోనే ఇది ప్రారంభం కాబోతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే సెప్టెంబర్ నెల ప్రారంభమై 4 రోజులు గడిచిపోతుంది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు, స్లీపర్ వస్తుందా? రాదా అనే డౌట్‌లో ఉన్నారు రైల్వే ప్రయాణికులు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణవై, వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశం పై కీలక ప్రకటన చేశారు.
వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో ప్రవేశ పెడతాం అని తెలిపారు. కానీ దీని ప్రారంభ తేదీలు ఖచ్చితంగా తెలియదు అని అన్నారు.
అలాగే దీని గురించి మాట్లాడుతూ..ఇది స్లీపర్ కోచ్ రైలు కాదు, అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడినది, వేగం, భద్రత , సౌకర్యం దీని ప్రత్యేకతలు
దీనిలో వికాలంగాల ప్రయాణీకుల కోసం ప్రత్యేక బెర్తులు, టాయిలెట్స్ వంటి ఆధునాతనమైన సౌకర్యాలతో దీనిని తీసుకరానున్నారంట.
ఈ రైలు 180 కిలో మీటర్ల వేగంతో, 1128 మంది ప్రయాణికులతో పరుగులు పెడుతుంది. ఇందులో ఏసీ ఫస్ట్ క్లార్ ఏసీ 2 టయర్, ఏసీ 2 టయర్ సహా 16 కోచ్‌లు ఉన్నాయంట.