రాష్ట్రపతి భవన్ లో పెళ్లి సందడి..!
samatha
01 february 2025
Credit: Instagram
రాష్ట్రపతి భవన్ వివాహానికి ముస్తాబవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్ర పతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
మొట్ట మొదటి సారిగా రాష్ట్ర పతి భవన్‌లో ఓ అమ్మాయి వివాహం జరగనుంది. దీనికి రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము పర్మిషన్ ఇచ్
చారు.
రాష్ట్రపతి భవనంలో పెళ్లి జరగడం ఏంటీ? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా. పూర్తి సమాచారం ఇప్పుడు మీ కోసం.
మధ్య ప్రదేశ్‌లోని శివపురికి చెందిన పూనమ్ గుప్తా సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా రాష్ట్రపతి భవ
న్ పీఎస్ వోగా సేవలు అందిస్తున్నారు.
అయితే ఆమె పని, నిబద్ధతకు ఆకర్షితురాలైన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్ లో వివాహ జరుపుకునేందుకు పర్
మిషన్ ఇచ్చింది.
జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా సేవలు అందిస్తున్న అవనీశ్ కుమార్‌తో ఫిబ్రవరి 12న పూనమ్ గుప్తా వివాహం జరగనుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు.
అనంతరం సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ లభించింది. గణతంత్ర దినోత్సవ కవాత
ులో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు
మరిన్ని వెబ్ స్టోరీస్
కైలాస మాన సరోవర్ యాత్ర పున:ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?
ఎలాంటి బాధ లేకుండా జీవితం సాగిపోవాలా.. సిపుల్ టిప్స్ మీకోసమే!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!