చికెన్ అలా చేసుకుంటే.. నో ఆయిల్.. టెస్ట్ అండ్ హెల్త్..

07 September 2025

Prudvi Battula 

ఆయిల్ లేకుండా చికెన్ చేయడానికి 4 ఎముకలు, చర్మం లేని చికెన్ బ్రెస్ట్స్, 2 నిమ్మకాయలు (రసం తీసినవి) 2 టేబుల్ స్పూన్లు తాజా రోజ్మేరీ (తరిగినవి), 2 టేబుల్ స్పూన్లు తరిగిన తాజా థైమ్ (హెర్బల్ షాపుల్లో దొరుకుతుంది), 2 వెల్లుల్లి రెబ్బలు (చిన్నగా కట్ చేసినవి), రుచికి ఉప్పు, మిరియాలు.

ముందుగా చికెన్‌ను పెరుగు, నిమ్మరసం, ఉల్లిపాయలతో ఒక గంట పక్కన పెట్టాలి. అలాగే ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్మేరీ, థైమ్, వెల్లుల్లి, ఉప్పు, మిరియాలు బాగా కలిపి మెరినేట్ చేసి పక్కన పెట్టుకోండి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి గ్రిల్ పాన్‌ను పెట్టుకొని కొంతసేపు మీడియం-హై హీట్‌లో వేడి చేయండి. ఇది వేడెక్కేలోపు చికెన్ బ్రెస్ట్స్‌ను మెరినేట్‎లో వేసి సమానంగా పూత పూయండి.

మెరినేట్‎ చేసిన చికెన్‌ను 5-7 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు గ్రిల్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ముక్కలను కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి.

అంతే ఆయిల్ లెస్ చికెన్ తినడానికి సిద్ధం. ఇప్పుడు మీరు దీన్ని రైస్ లేదా చపాతీతో తినవచ్చు. ఇది చాల టేస్టీగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా.

చికెన్ పాన్‎కి అంటుకోకుండా ఉండటానికి నాన్-స్టిక్ గ్రిల్ పాన్ లేదా గ్రిల్ మ్యాట్ ఉపయోగించండి. పాన్ పూర్తిగా నింపకండా చికెన్‎ను కొద్ది కొద్దిగా రెండుసార్లు ఉడికించుకోండి.

ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మెరినేట్చేసిన చికెన్ బ్రెస్ట్‌లను మీ ఓవెన్‌లో 400°F (200°C) కు వేడిలో 20-25 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు కాల్చండి.

లేదంటే  మ్యారినేట్ చేసిన చికెన్ బ్రెస్ట్‌లను ఎయిర్ ఫ్రైయర్‌లో 375°F (190°C) వద్ద 10-12 నిమిషాలు లేదా పూర్తిగా ఉడికినంత వరకు ఉడికించాలి.