ఫ్రిజ్ అవసరమే లేదు.. కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

Samatha

06 April 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పక ఉండే వాటిలో కొత్తిమీర ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొత్తిమీర తప్పకుండా కొనుగోలు చేస్తారు.

కొత్తిమీర

కొత్తిమీర వంటల్లో ఉపయోగించడం వలన కర్రీలకు, వంటలకు మంచి రుచి వస్తుంది. అంతే కాకుండా కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మంచి రుచి, వాసన

అయితే చాలా మంది కొత్తిమీర కొనుగోలు చేసిన తర్వాత దానిని తాజాగా ఉంచేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

కొత్తిమీర కొనుగోలు

కొత్తిమీరను మార్కెట్  నుంచి తీసుకొచ్చిన వెంటనే కడగడం లాంటిది చేయకూడదు. కొత్తిమీరకు నీళ్లు తగలకుండా చూసుకోవాలి.

కడగ కూడదు

నీటిలో తడిపి ఫ్రిజ్‌లో పెట్టడం వలన త్వరగా కొత్తిమీర ఆకులు పసుపు రంగులోకి మారి పాడైపోయే ఛాన్స్ ఉంది.

నీరు తగలడం

అదే విధంగా కొత్తిమీర చాలా తాజాగా ఉండాలి అంటే, టిష్యూ పేపర్లో పెట్టి, గాలి చొరబడని బాక్స్ లో స్టోర్ చేయాలి దీని వలన ఫ్రెష్‌గా ఉంటుంది.

టిష్యూ పేపర్లో చూడటం

కొత్తిమీరను వేర్లతో కొనుగోలు చేసినట్లు అయితే దానిని గ్లాస్ నీరు పోసి, అందులో కొత్తిమీరను పెట్టాలి. దీని వలన ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది.

గ్లాస్ నీరు

అలాగే ఒక డబ్బా అడుగున టిష్యూ పేపర్ పెట్టి, డబ్బా మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో పెట్టడం వలన కూడా కొత్తి మీర చాలా తాజాగా ఉంటుంది.

డబ్బాలో పెట్టి మూత పెట్టడం