30 April 2025
Meta/Pexels/Pixa
TV9 Telugu
మల్లె పువ్వులను ఎండబెట్టి నిల్వ చేసుకుని కావాలకున్నప్పుడు ఉపయోగించాలి. ఎండిన మల్లె పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మల్లె పువ్వులతో సువాసనతో కూడిన టీ. ఇది సాధారణంగా గ్రీన్ టీ బేస్‌తో తయారు చేస్తారు. ఇది కొద్దిగా తీపి రుచి, సువాసనను కలిగి ఉంటుంది. ఇది చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సువాసనగల టీలలో ఒకటి.
జాస్మిన్ టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు కరిగిపోవడానికి సహాయపడుతుంది. దీనిలోని కాచెన్స్ అనే గుణాలు జీవక్రియల వేగాన్ని పెంచి ఎక్కువ క్యాలరీలు కరిగేలా చేస్తాయి.
మల్లె పువ్వుల టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ టీని రెగ్యులర్ గా తాగడం వలన వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు
ఎవరైనా మానసిక ఒత్తిడితో రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే..ఎటువంటి కలత లేకుండా నిద్రపట్టాలంటే పడుకునే ముందు కప్పు మల్లె టీని తీసుకోవాలి.
జాస్మిన్ టీలో ఉండే కెఫిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. కెఫిన్ మీ మెదడు సెరోటోనిన్, డోపమైన్ వంటి మానసిక స్థితిని పెంచే రసాయనాలను విడుదల చేయడానికి ప్రోత్సహిస్తుంది.
మల్లె టీలో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.
మల్లె పువ్వు టీలోని పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. జాస్మిన్ టీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మల్లె పువ్వుల టీ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జ్వరాన్ని తగ్గించి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.