మంచిదే కాదండోయ్.. వీరికి బెల్లం విషంతో సమానం!

samatha

02 september 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరి ఇంటిలో బెల్లం అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీనిని అనేక రకాల స్వీట్ తయారికి ఉపయోగిస్తుంటారు.

అయితే బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతను తరిమి కొట్టి, హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతుంది.

అయితే బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని కొంత మంది తినడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు.

కాగా, ఇప్పుడు మనం బెల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో వివరంగా తెలుసుకుందాం పదండి.

ఎవరు అయితే ఆస్తమా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటారో, వారు అస్సలే బెల్లం తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు.

అంతే కాకుండా, అధిక బరువు ఉన్నవారు కూడా బెల్లం తినకపోవడమే మంచిది. ఇది బరువును మరింత పెంచే ప్రమాదం ఉంది

అలాగే ఎవరి శరీరం అయితే ఎప్పుడూ ఎక్కువ వేడిగా ఉంటుందో వారు కూడా అస్సలే బెల్లం తికకూడదు అంటున్నారు నిపుణులు.

అదే విధంగా డయాబెటీస్ ఉన్న వారు కూడా బెల్లం తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.