బయటపడిన రహస్యం.. నాగసాధువులు నగ్నంగా ఉండటానికి కారణం ఇదే!
samatha
19 January 2025
ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ నాగ సాధువులు,అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇక నాగ సాధువులు నగన్నంగా ఉంటూ ఒంటినిండా బూడిదతో కనిపిస్తుంటారు. అయితే చాలా మంది అసలు వారు నగ్నంగా ఎందుకు ఉన్నారు అని ఆలోచిస్తుంటారు.
కాగా, అసలు నాగసాధువులు నగ్నంగా ఉండటానికి గల కారణాలు ఏంటీ? వారు ఎందుకు అలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగసాధువులు కొన్ని సంవత్సరాలు ఒక గుహలో ఉండి ధ్యానం చేసి, మరికొన్ని రోజుల పాటు మరో గుహలోకి వెళ్తుంటారు. వీరు ఎక్కువ రహస్య గుహలో ఉండటానికి ఇష్టపడుతారంట.
అంతే కాకుండా వీరు ఎక్కువగా వేర్లు, దుంపలు తిని తమ జీవనాన్ని సాగిస్తారు. ఒక్కోసారి వారు ఏడు ఇళ్లల్లో బిక్షాటన చేసే అవకాశం ఉంటుంది.
ఏడు ఇళ్లల్లో ఎంత ఆహారం దొరికితే అంత వారు తినగలరు, ఒక వేళ ఆహారం దొరకకపోతే వారు పస్తులుండాల్సిందేనంట.
ఇక వారు నగ్నంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉన్నదంట.నాకు పెళ్లి ,పిల్లలు కావాలి,మంచి జాబ్,ఇల్లు ఇలాంటి కోరికలు లేవు, అవన్నీ కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉంటాయి. తర్వాత అవి కష్టమైనవే..
ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అవుతుంది.. అనేదానికి సూచనగా నగ్నంగా ఉండి, బూడిద రాసుకుంటారంట. అలాగే నాశనం కానిది దేవుడు ఒక్కడే.. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు.. ఉంటాడు.. అనేదానికి బలంగా నమ్ముతారంట.