భరణం రూపంలో వచ్చిన డబ్బు టాక్స్ కట్టాల్సిందేనా?

TV9 Telugu

17 January 2025

కోర్టులో విడాకుల సమయంలో భరణం రూపంలో వచ్చిన డబ్బుకు కూడా పన్ను విధిస్తారో లేదో ఈరోజు మనం తెలుసుకుందాం..

భరణం అనేది దంపతులు లీగల్ పద్దతిలో కోర్టులో విడాకుల తీసుకున్న తర్వాత భర్త నుంచి భార్యకు లభించే ఆర్థిక సహాయం.

భారతదేశంలో విడాకులు తర్వాత భర్త నుంచి భార్యకు భరణం రూపంలో లభించిన డబ్బుపై పన్నుకు సంబంధించి స్పష్టత లేదు.

విడాకుల తర్వాత ఏకమొత్తంలో భర్త నుంచి పొందే భరణంపై పన్ను విధించబోమని ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో పేర్కొంది.

విడాకుల తర్వాత భర్త నుంచి భార్యకి ప్రతి నెల ఇచ్చే భరణం రెవెన్యూ రశీదుగా పరిగణించవచ్చని చట్టం చెబుతోంది.

విడాకుల తర్వాత భర్త నుంచి ప్రతి నెల లభించే భరణం ఇతర మూలాధార ఆదాయం వలె పన్ను విధించదగినదిగా పరిగణిస్తారు.

అదే సమయంలో, లీగల్ విడాకుల తర్వాత భర్త నుంచి భార్యకు బదిలీ చేసిన ఆస్తిపై కూడా పన్ను విధించడం జరుగుతుంది.

భార్యాభర్తల మధ్య సంబంధం ముగిసిన తర్వాత ఈ బహుమతి ఉండదు. కాబట్టి దీనికి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.