చికెన్ బోన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
Samatha
17 august 2025
Credit: Instagram
నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటుంటారు.
ఇక ముఖ్యంగా చాలా మంది చికెన్ తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక చాలా మంది చిక
ెన్లో మెత్తటి పీస్‌లు తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కానీ కొంత మంది మాత్రం చికెన్‌లో ఓన్లీ బోన్ పీస్‌లే తింటుంటారు. మరి ఇలా చికెన్‌లో బోన్ పీస్‌లు తినడం మంచిదేనా?కాదా తెలుసుకుందాం.
చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్‌తో పాటు ఎముకలను కూడా నమిలేస్తుంటారు. కానీ ఇలా చికెన్ బోన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
కొందరు నాటుకోడి కూర తింటారు. అయితే ఈ నాడు కోడి చికెన్ బోన్ తింటే అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదంట.
కానీ కృతిమంగా పెరిగిన కోళ్లను చికెన్ వండుకొని వాటి బోన్ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే ఛాన్స్ ఉన్నదంట.
ఇలా తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి కాస్త టైమ్ పడుతుందంట. అంతే కాకుండా కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయం
ట.
అలాగే, పేగులలో అడ్డంకులు వంటి సమస్యలు, ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళంలో చిక్కుకునే అవకాశం ఉంటుందంట.
కొన్ని సార్లు చికెన్ బోన్ శ్వాస నాళంలో ఇరుక్కపోయి ఊపిరాడక ఇబ్బంది పడే పరిస్థితి కూడా రావచ్చు అంద
ుకే చికెన్ బోన్ తినకూడదంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
PCOS గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన 10 నిజాలివే!
చికెన్ తెచ్చే ముప్పు ఇదే.. ఎక్కువ తింటే ఖతమే!
చాణక్య నీతి : ఎవరి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందో తెలుసా?