హైదరాబాద్ టూ శ్రీశైలం.. శివరాత్రి బ్లాక్ బస్టర్ టూర్ ప్యాకేజ్.. 

TV9 Telugu

21 February 2025

శివరాత్రి రోజు శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.

శ్రీశైలం వెళ్లేవారి కోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్సిటిసి టూరిజం ''SPIRITUAL TELANGANA WITH SRISAILAM" పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ కొత్త టూర్ ప్యాకేజీలో శ్రీశైలం మల్లికార్డునుడితో యద్రాది లక్ష్మి నరసింహ స్వామిని కూడా దర్శించుకుంటారు.

24 ఫిబ్రవరి 2025న మొదలుకానున్న ఈ ప్యాకేజీలో  మొదటిరోజు హైదరాబాద్‎లోని చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ చూసి రాత్రి అక్కడే హోటల్‎లో బస చేస్తారు.

రెండో రోజు ఉదయం బయలుదేరి 5 గంటలకు శ్రీశైలం వెళ్లి మల్లిఖార్డున స్వామి దర్శనం చేసుకొని సాయంత్రనికి హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు.

3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్, గొల్కోండ ఖిల్లా చూసి మధ్యాహ్నం భోజనం ముగించి అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్‎లోనే బస చేస్తారు.

4వ రోజు ఉదయం యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం తర్వాత సురేంద్రపురి సందర్శించి సాయంత్రం హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ఈ ట్రిప్ కోసం సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 37200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.  19530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి  రూ. 14880గా ధరలు నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.