భారతీయుల దగ్గర టన్నుల కొద్దీ పసిడి.. విలువ ఎన్ని లక్షల కోట్లంటే..?
15 October 2025
Prudvi Battula
Images: Pinterest
భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛాన్స్ దొరికితే చాలు బంగారు నగలు కొనడానికి ట్రై చేస్తారు.
పెళ్లిళ్లు సహా కొన్ని రకాల ఫంక్షన్స్ కోసం బంగారం పక్కాగా ఉండాల్సిందే. అయితే భారతీయులు వద్ద కొన్ని కోట్ల విలువ చేసే బంగారం ఉందని వెల్లడైంది.
భారతీయుల ఇళ్లల్లో, లాకర్లలో టన్నుల కొద్దీ బంగారాన్ని స్టోర్ చేసుకున్నారు. ఆ పసిడి విలువ చేస్తే కళ్ళు చెదరాల్సిందే.
ఒకప్పుడు ఆభరణంగా మాత్రమే ఉన్న బంగారమా ఇప్పుడు పెట్టుబడి సాధనంగా మారిపోయింది. అత్యవసర సమయంలో ఆర్థికంగా అండగ ఉంటుందని భావిస్తున్నారు.
బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా తమ స్థోమతకు తగినట్లు చాలామంది బంగారం కొంటున్నారు. ఇప్పుడిది సామాన్యులకు అందనంత ధరకి పెరిగిపోయింది.
2025లోనే పసిడి ధర ఏకంగా 62 శాతం పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంధం 1,30,000 రూపాయలపై ఉంది. ఇంకా పెరుగుతూ పైపైకి వెళ్ళిపోతుంది.
భారత్‌లో ప్రజల వద్ద ఉన్న 34,600 టన్నుల బంగారం 3.8 ట్రిలియన్ డాలర్లని అంచనా. మన కరెన్సీలో రూ.337 లక్షల కోట్లు.
దీపావళి సీజన్ కావడంతో బంగారం గిరాకీ కారణంగా ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..