బంగారం షైన్ పోయిందా.? ఇంట్లో ఇలా చేస్తే.. కొత్తదానిలా మెరిసిపోతుంది.. 

05 September 2025

Prudvi Battula 

బంగారం అంటే ఇష్టపడని ఆడవారు ఉండరన్నది చాలామంది చెప్పే మాట. వీటితో చేసిన ఆభరణాలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు.

ఒక్కోసారి బంగారంతో చేసిన నగలు షైన్ పోతే షాప్‎కి వెళ్లి మెరుగు పెట్టించడం కామన్. ఆలా కాకుండా మీ ఇంట్లోనే మెరిసేలా చేయవచ్చు.

ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు, 1 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 నిమ్మకాయ రసం, చిటికెడు ఉప్పు, కొద్దిగా లిక్విడ్ సోప్ లేదా ఒక షాంపూ వేసి పూర్తిగా కరిగే వరకు కలపండి.

తర్వాత షైన్ పోయిన మీ బంగారు ఆభరణాలను అందులో వేసి కనీసం 30 నిమిషాల పాటు ఓ పక్కన పెట్టిసి అలాగే ఉంచండి.

తర్వాత జిడ్డు పోవడానికి సాఫ్ట్ టూత్‌బ్రష్‌తో మెల్లగా రుద్ది శుభ్రమైన నీటితో నగలనుకడిగి మెత్తని వస్త్రంతో తుడవాలి.

మీ ఇంట్లోనే ఇలా చేస్తే చాలు.. షైనింగ్ పోయిన మీ పాత బంగారు ఆభరణాలు కొత్తగా కొన్న వాటిలా తళతళ మెరుస్తాయి.

ఈ నేచురల్‌ క్లీనింగ్‌ మెథడ్‌లో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉండవు. ఆభరణాలు దెబ్బతినే లేదా బరువు తగ్గే ప్రమాదం ఉండదు.

ఎటువంటి ఖర్చు లేకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు. పదార్థాలు సహజమైనవి కాబట్టి ఆభరణాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.