ఈ టిప్స్ ట్రై చేస్తే.. మీ స్విచ్ బోర్డులు కొత్త వాటిలా మెరిసిపోతాయి.. 

17 October 2025

Prudvi Battula 

Images: Pinterest

మీరు ఎరేజర్ తీసుకొని స్విచ్ బాక్స్‌లోని మరకలపై రబ్ చేస్తే, అది అన్ని మరకలను తొలగించి మెరిసేలా చేస్తుంది. కాగితంపై తుడిచివేసినట్లుగా.

ఎరేజర్

షేవింగ్ క్రీమ్ పావు చెంచా తీసుకొని టూత్ బ్రష్‌తో స్విచ్ బోర్డుపై అప్లై చేసి 10 నిమిషాలు ఉంచి అదే టూత్ బ్రష్‌ను ఉపయోగించి బాగా రద్దీతో మురికి తొలగిపోతుంది.

షేవింగ్ క్రీమ్

మీ ఇంట్లో మురికిగా ఉన్న స్విచ్‌బోర్డులను శుభ్రం చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ను అప్లై చేసి దానిపై బాగా రుద్దండి. మీ స్విచ్‌బాక్స్ కొత్తదిలా అవుతుంది.

నెయిల్ పాలిష్ రిమూవర్

ఆ చిన్న కాటన్ క్లాత్ ముక్కకు కొబ్బరి నూనె రాసి మురికిగా ఉన్న స్విచ్ బోర్డుకి అప్లై చేయండి. దానిని 10 నిమిషాలుఉంచి ఆపై స్క్రబ్బర్ లేదా మరొక గుడ్డతో బాగా రుద్దితే మరకలు పోతాయి.

కొబ్బరి నూనె

మీరు మీ ఇంట్లో స్విచ్‌బోర్డ్‌ను శుభ్రం చేసినప్పుడల్లా కొన్ని విషయాలు గుర్తుంచుకోవలసిన అవసరం చాలా ఉంది.

గుర్తుంచుకోవలసిన విషయాలు

స్విచ్‌బోర్డ్‌ను నీటి వంటి ద్రవాలతో శుభ్రం చేయవద్దు. అది ప్లగ్ పాయింట్, స్విచ్‌బోర్డ్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ద్రవాలతో శుభ్రం చేయవద్దు

మీరు స్విచ్‌బోర్డ్‌లను శుభ్రం చేయడం ప్రారంభించే ముందు, మీరు మీ ప్రధాన మెయిన్‎ను ఆఫ్ చెయ్యడం మర్చిపోవద్దు.

మెయిన్‎ను ఆఫ్ చెయ్యండి

స్విచ్‌బోర్డ్‌లను శుభ్రం చేసే ముందు రబ్బరు బూట్లు ధరించడం చాలా అవసరం. లేదంటే చెప్పులు ధరించిన పర్వాలేదు.

రబ్బరు బూట్లు ధరించండి