మొక్కజొన్న పీచే కదా అని పడేస్తే.. ఆ లాభాలు మిస్సయినట్టే.. 

12 October 2025

Prudvi Battula 

మొక్కజొన్నలు చాలామంది ఇష్టంగా తింటారు. దీన్ని ఇష్టపడని వారుండరు. ఇది చాల రుచికరంగా, పోషకాలతో నిండి ఉంటుంది.

మొక్కజొన్నలు ఉడకబెట్టే ముందు దానిపై ఉన్న పీచును తీసి పడేస్తాం. అయితే దీంతో చాల లాభాలు ఉన్నాయన్నది నిపుణులు మాట.

మనం చెత్తగా భావించే మొక్కజొన్న పీచును 5000 సంవత్సరాల క్రితం అనేక అనారోగ్యాల చికిత్సలో దీన్ని వాడేవారు.

దీపావళి అంటేనే ఫ్యామిలీ గెట్ టు గెద‌ర్‌లు, పార్టీల హ‌డావిడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు కూడా సంతోషంగా జరుపుకొనే పండగ.

మనం పక్క బయటపడేసే మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి2, సి, కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకొని తాగితే.. కిడ్నీల్లో పేరుకుపోయిన టాక్సిన్స్‌, నైట్రేట్‌లు అన్ని పోతాయి.

మొక్కజొన్న పీచులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు యూరినరీ ట్రాక్‌‌ ఇన్ఫెక్షన్‌, మూత్రంలో మంటను దూరం చేస్తాయి.

మొక్కజొన్న పీచులో ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. షుగర్‌ పేషెంట్స్‌ మొక్కజొన్న పీచు టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.

మొక్కజొన్న పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గాలనుకొనేవారికి మంచి ఎంపిక. అధిక కొవ్వును కరిగిస్తుంది.