ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ భాగస్వామి మీకు దూరం అవుతున్నట్లే!

Samatha

20 august  2025

Credit: Instagram

భార్యభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకరిగా జీవనం కొనసాగిస్తారు. అయితే ఏ బంధంలో అయినా సరే గొడవలు సహజం.

కొందరు ఎన్నిసార్లు గొడవపడినా కలిసిపోయి ఆనందంగా జీవిస్తారు. కానీ కొంత మంది మాత్రం చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి బంధాన్ని తెంచేసుకుంటారు.

అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తే మీ భాగస్వామి మీకు దూరం అవుతున్నట్లే అంటున్నారు నిపుణులు. కాగా , దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీ భాగస్వామి మీతో గంతంలో‌లా ఎక్కువగా మాట్లాడకుండా, ప్రతి విషయాన్ని మీతో పంచుకోవడం లేదు అంటే? మీ భాగస్వామి మీకు దూరం అవుతున్నట్లేనంట.

మీతో కలిసి ఏ పార్టీలు లేదా ఫంక్షన్స్‌కు రావడానికి ఇష్టపడకపోయినా, మీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టం చూపకపోతే బంధం ముగింపుకు వచ్చిన్లేనంట.

మీరు ఏదైనా ఇబ్బంది పడినప్పుడు, లేదా విసుగు చెందినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీ భాగస్వామి మీ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించనట్లైతే మీ భాగస్వామి దూరం అవుతున్నట్లేనంట

ఎప్పుడూ లేని విధంగా పదే పదే చికాకు పడటం, చిన్న విషయాలు కూడా గట్టిగా అరవడం, నిరాశ లేదా నిరాసక్తతను చూపించడం కూడా మీ బంధంలో చీలికను చూపిస్తాయంట.

మీ భాగస్వామి సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడపడం, ఇతరులతో ఎక్కువ మాట్లాడటానికి, వారితో అన్నీ షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటే అతను మీ నుంచి దూరం అవుతున్నట్లేనంట.