డ్రాగన్ ఫ్రూట్‌తో ఈ రెసిపీలు చేసుకుని తింటే.. టేస్ట్ అండ్ హెల్త్..

Prudvi Battula 

Images: Pinterest

30 October 2025

1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, 1 టీస్పూన్ తేనె, ఐస్ క్యూబ్స్ ఓ బౌల్‎లో వేసుకొని బాగా మిక్స్ చేసి అల్పాహారం లేదా స్నాక్‌గా ఆస్వాదించండి.

డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ

2 కప్పులు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1 కప్పు ఆకుకూరలు,1/2 కప్పు ఫెటా చీజ్ ముక్కలు, 1/4 కప్పు తరిగిన పెకాన్స్, 2 టేబుల్ స్పూన్లు తేనె-నిమ్మ డ్రెస్సింగ్ బౌల్‎లో వేసుకొని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ సలాడ్

2 కప్పులు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1 కప్పు ఎర్ర ఉల్లిపాయ, 1 కప్పు మిరియాలు, 1/4 కప్పు కొత్తిమీర, ముక్కలుగా కోయండి, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి చేసుకోండి.

డ్రాగన్ ఫ్రూట్ సల్సా

2 కప్పుల డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1 కప్పు నీరు, 1 టీస్పూన్ తేనె మిక్సర్‎లో వేసుకొని బాగా గ్రైండ్ చేసి వడకట్టి రిఫ్రెషింగ్ డ్రింక్‌గా ఆస్వాదించండి.

డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్

స్టవ్ ఆన్ చేసి పాన్‎లో 1 షీట్ పఫ్ పేస్ట్రీ వేసుకొని 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలని దాని అమర్చి తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం వేసి పేస్ట్రీ బంగారు గోధుమ రంగు వచ్చే వరకు కాల్చండి.

డ్రాగన్ ఫ్రూట్ టార్ట్స్

ఓక బౌల్‎లో 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1 కప్పు పండిన అవకాడో ముక్కలు, 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, రుచికి ఉప్పు, మిరియాలు విసుకొని బాగా కలిపి తినండి.

డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సలాడ్

2 కప్పుల ప్యూరీ చేసిన డ్రాగన్ ఫ్రూట్ వేసుకొని అందులో1 కప్పు చక్కెర, 1 కప్పు నీరు వేసుకొని బ్లెండర్‌లో కలిపి ఐస్ క్రీం మేకర్ లేదా మెటల్ గిన్నెలో ఫ్రీజ్ చేయండి.

డ్రాగన్ ఫ్రూట్ సోర్బెట్

ఒక గిన్నెలో 1 కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు గ్రానోలా వేసుకోండి. చివరిగా అందులో తేనెతో చిలకరించండి. దీన్ని స్నాక్ లేదా అల్పాహారంగా ఆస్వాదించండి.

డ్రాగన్ ఫ్రూట్, పెరుగు పర్ఫైట్