చేతితో తినడం వల్ల లాభాలు తెలిస్తే.. స్పూన్ పక్కన పెట్టేస్తారు..

02 September 2025

Prudvi Battula 

చేతితో అన్నం తినే అలవాటు ఇప్పటికి కాదు. ఎన్నో శతాబ్దాలుగా భారతీయులు ఇదే పద్ధతిని అనుసరిసస్తూ వస్తున్నారు.

ఏదైనా ఆహారాన్ని మనం చేతితో తాకినప్పుడు కొన్ని సెన్సెస్ ఆక్టివేట్ అయ్యి జీర్ణ సంబంధిత ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఇవి ఆహారాన్ని చాలా సులభంగా జీర్ణం చేస్తాయి.

స్పూన్‎‎తో తిన్నప్పుడు ఎక్కువగా తినేస్తాం. అదే చేతితో తింటే మనకి నచ్చినట్టుగా ముద్దలుగా చేసుకుని ఎంత కావాలో అంతే తినొచ్చు. దీన్నే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు.

ఆయుర్వేదం ప్రకారం మన చేతికి ఉన్న ఐదు వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. నిప్పు,నీరు, గాలి, ఆకాశం, నేల. ఇవన్నీ మన శరీరంలోనే ఉంటాయి.

ఆహారాన్ని చేతితో తిన్నప్పుడు ఈ పంచభూతాలను గౌరవించినట్టు అవుతుంది.అందుకే చాలా మంది పెద్ద వాళ్లు చెంచాతో తింటుంటే వారిస్తారు. శుభ్రంగా చేయితో తినొచ్చు కదా అని సలహా ఇస్తారు.

చేయితో తింటే సెన్స్ తెలుస్తుంది. అన్ని విధాలుగా ఆ ఆహారాన్ని ఆస్వాదించి తినేందుకు అవకాశముంటుంది. అదే చెంచాతో తింటే ఆ సెన్స్ అనేది మిస్ అవుతుంది.

చేతితో తినడం మంచిదే. అయితే..చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గమనించుకోవాలి. తినే ముందు కచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి.

అన్నం తినే ముందు వేళ్లతో టచ్ చేసి ఎంత వేడిగా ఉందో సెన్స్ చేయాలని చెబుతోంది ఆయుర్వేదం. అలా చేయడం వల్ల ఆహారానికి, మనకి మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది.